3 July, 2026 | 11:12 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

పట్టుబడ్డ నిషేధిత రసాయనాలు

13-07-2024 01:59 AM

చైనా నుంచి పాక్‌కు సరఫరా 

న్యూఢిల్లీ, జూలై 12 : చైనా నుంచి భారత్ గుండా పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్న నిషేధిత రసాయ నాలను తమిళనాడు పోర్టులో భార త భద్రతా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. టియర్ గ్యాస్  తయా రీలో ఉపయోగించే వీటి ఎగుమతులపై అంతర్జాతీయంగా నిషేధం ఉం దని అధికారులు తెలిపారు. చైనా సాయంతో పాకిస్థాన్ ప్రమాదకర రసాయన, జీవాయుధాల తయారీ చేస్తోందని ఆరోపించారు. చైనాకు చెందిన ఓ సంస్థ పాకిస్థాన్‌లోని ఓ రక్షణ ఉత్పత్తుల సరఫరా కంపెనీకి ‘ఆర్థో క్లోరో బెంజిలిడిన్ మలో నోనిట్రైల్’ అనే రసాయనాన్ని చేరవేస్తుం డగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ 2,560 కిలోల సరుకును 103 డ్రమ్ముల్లో నింపి ఏప్రిల్ 18న షాంఘై నౌకాశ్రయంలో ఓ వాణిజ్య నౌకలో లోడ్ చేశారు. కరాచీకి బయలుదేరిన ఆ నౌక మే 8న తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు చేరుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు వీటిని పట్టుకున్నారు.