28 August, 2026 | 4:30 AM

అక్రమ మద్యం పట్టివేత

28-08-2026 12:00 AM

కోరుట్ల ,ఆగస్టు 27 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎక్సైజ్ పరిధిలోని కథలాపూర్ మండలం తాండ్రియాల సమీపంలో అక్రమ మద్యం తరలిస్తున్న వాహ నాన్ని పట్టుకొని 6.38 లక్షలవిలువైన 70 బాక్సుల ఇంపీరియల్ బ్లూ (ఐబి) మద్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి మద్యం రవాణాకు ఉపయోగించిన ఐచర్ వ్యాను నాలుగు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

మహా రాష్ట్ర బీవండి, హవేలీ,నుండి తెలంగాణకు చాకచక్యంగా అక్రమంగా మద్యం తరలిస్తు న్న బీవండి ప్రాంతానికి చెందిన సిరిగిరి ప్రవీణ్ అక్రమ మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.ఈనెల 14న కథలాపూర్ మండలం గంభీర్పూర్ లో 13 బాక్సులు అక్రమ మద్యం పట్టుబడిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఆ కేసు దర్యాప్తులో భా గంగా లభించిన సమాచారం మేరకు సాంకేతిక ఆధారాల ద్వారా ఎక్సైజ్ అధికారులు ని ఘా తీవ్రతరం చేశారు.

ఈ క్రమంలో మహారాష్ట్రలోని బీవండికి చెందిన ప్రధాన నింది తుడు సిరిగిరి ప్రవీణ్ దాద్రా నగర్ హవేలీలో 2.85 లక్షలకు 70 బాక్సుల మద్యాన్ని కొనుగోలు చేసినట్టు గుర్తించారు మద్యాన్ని కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి తరలించేందుకు వ్యాన్ డ్రైవర్ ప్రదీప్ జైస్వాల్ అతడి స్నేహితుడు అజయ్ ,భగవాన్, తో రూ.65000 వెయ్యిలకు ఒప్పం దం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుం డా ఐచర్ వ్యాన్ లో ప్రత్యేక ర్యాకులు రహ స్య అరలు, ఏర్పాటు చేసుకొని మద్యాన్ని అనుమానం రాకుండా అరళ లో దాచి పెట్టి మహారాష్ట్ర నుండి తెలంగాణలోని పలు గ్రామాల బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు.