calender_icon.png 1 August, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ యువ కబడ్డీ లీగ్ ఛాంపియన్ షిప్ కు ఎంపిక పోటీలు

31-07-2025 05:49:14 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యువ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు బాలురుల జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ఆగస్టు 2 న జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్  గ్రౌండ్ లో   ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికైనవారు ఆగస్టు 3 న ఎల్బీ స్టేడియంలో యువ తెలంగాణ ప్రీమియర్ లీగ్ కబడ్డీ పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తారు. ఎంపికైన వారినీ 8 టీములుగా ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 27 నుండి నవంబర్ వరకు తెలంగాణ ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటారు.

ఎంపికైన వారికి పారి తోషకం ఉంటుందని తెలిపారు.ఆసక్తి గల కబడ్డీ క్రీడాకారులు 27.03.2003 తర్వాత పుట్టిన వారికి అవకాశం  కల్పించిన్నారు. క్రీడాకారులు వచ్చేటప్పుడు ఒక ఆధార్ కార్డు ,రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ,రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు తీసుకొనీ  అసోసియేషన్ కోచ్  రాకేష్  కు ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయగలరని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  అత్రం ధర్మారావు, కార్యవర్గ సభ్యులు అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. పూర్తి వివరాలకు  8247096710, 9441734946 సంప్రదించాలని సూచించారు.