calender_icon.png 1 August, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

31-07-2025 05:52:40 PM

సమన్వయంతో సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి

జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు

కోదాడ: ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం సంఘ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అర్వపల్లి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం రాంబాబు, ఉపాధ్యక్షులు చాప గోవిందరావు, సహాయ కార్యదర్శి ఓరుగంటి శ్రీనివాసరావు, కోశాధికారిగా సముద్రాల బద్రిష్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అభినందనలు తెలిపి మాట్లాడారు.

మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సహకారంతో అసోసియేషన్ అభివృద్ధికి, సభ్యులకు, గుమస్తాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. సంఘ సభ్యులు అందరూ కలిసి ఎటువంటి ఎన్నికలు లేకుండా ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు  ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం గుమస్తాల సంఘం కార్యవర్గానికి కూడా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా అనంతు సైదులు, ఉపాధ్యక్షులుగా వెంకట రాజారావు, ప్రధాన కార్యదర్శిగా వేమూరి నరసింహమూర్తి, సహాయ కార్యదర్శి పల్లా నాగరాజు, కోశాధికారిగా కొల్ల సురేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.