5 March, 2026 | 2:57 AM

రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

05-03-2026 01:21 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 4(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్బాల్ ఎంపికా పోటీలు గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 20 మంది క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు.

ఎంపికైన వారికి ఏడు రోజులు రెసిడెన్షియల్ లో కోచింగ్ క్యాంప్ నిర్వహించి, ఈ నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ టోర్నమెంట్కు పంపనున్నట్లు తెలిపారు.పోటీలకు సహకారం అందించిన గిరిజన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, క్రీడా పాఠశాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున యాదవ్ క్రీడాకారులను అభినందిస్తూ భవిష్యత్తులో ఎంపీపీ కప్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ ఉద్దవ్, మడవి శేకు, జంగు, సాయిబాబా, కోచ్లు అరవింద్, రాజలింగు, విద్యాసాగర్, రవి, రాకేష్, యాదగిరి, శృతి పాల్గొన్నారు.