27-05-2025 06:28:16 PM
మండల ప్రత్యేక అధికారి, సివిల్ సప్లై డిఎం. ప్రసాద్..
పెన్ పహాడ్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తు పెట్టుకున్న లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని మండల ప్రత్యేక అధికారి, సివిల్ సప్లై డిఎం ప్రసాద్(Civil Supply DM Prasad) అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులు అందజేసిన దరఖాస్తుల ప్రాసెసింగ్ ఆయన పరిశీలించి మాట్లాడారు. అలాగే పెన్ పహాడ్ నర్సరీని సందర్శించి మొక్కల పెరుగుదల, వాచర్స్ చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు ఉన్నారు.