5 August, 2026 | 2:20 AM

డిజిటల్ సర్వేకు పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాల ఎంపిక..

05-08-2026 01:24 AM
  1. నేటి నుంచి ఇంద్రవెల్లి మండలంలో డిజిటల్ సర్వేకు శ్రీకారం
  2. అక్షాంశాలు, రేఖాంశాలతో సాగు భూములకు హద్దులు

ఉట్నూర్, ఆగస్టు 4 : రైతులు సాగు చే స్తున్న వ్యవసాయ భూములతో పాటు గ్రా మకంఠం, ప్రభుత్వ భూములకు రాష్ట్ర ప్రభు త్వం డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ సర్వేలో రైతులకు సంబంధించిన వ్యవ సాయ భూములకు అక్షాంశాలు, రేఖాంశాలతో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతీ పథకంలో పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 70 గ్రామాలు ఎంపిక చేయగా ఇంద్రవెల్లి మండలంలో మూడు గ్రామాలను ఎంపిక చేశారు.

మండలంలోని ఇంద్రవెల్లి పంచాయతీ పరిధిలోని హీరాపూర్, హార్కాపూర్ పంచాయతీ పరిధిలోని మామిడి గూడ(జి), మల్లాపూర్‌తో పాటు డోన్గర్ గావ్ గ్రామాల ను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఎంపికైన గ్రామాల్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే పూర్తి చేసి రైతులకు అ వసరమైన సర్వే నెంబర్లకు భూదాన్ నెంబర్ కేటాయిస్తారు. నెంబర్ తోపాటు రైతుకు సం బంధించిన భూమి హద్దులను గుర్తించి వారి కి అందజేసే పట్టాదార్ పాస్ పుస్తకంలో భూ మి హద్దులు నిర్వహిస్తూ డిజిటల్ మ్యాప్ ను సైతం జత చేసి రైతుకు అందిస్తారు.

 నైజాం సర్కార్ తర్వాత సర్వే..

రైతుల సాగు భూములకు నిజాం పరిపాలన కాలంలో సర్వే చేపట్టి సంబంధిత మ్యా పులను ఇప్పటి వరకు భద్రంగా ఉంచారు. ఆ కాగితాల ఆధారంగానే రైతుల వ్యవసా య భూముల హద్దులను రెవెన్యూ అధికారులు చూసేవారు. వ్యవసాయ భూములకు నైజాం సర్కార్ కాలంలో రైతుల భూముల కు హద్దురాలను ఏర్పాటు చేసేవారు.

కాలక్రమేనా భూ అక్రమాలు పెరుగుతూ, భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సర్వే ప్రాధాన్యత పెరగడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు డిజిటల్ సర్వే చేపట్టి హద్దులను పకడ్బందీగా గుర్తించేందుకు డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్, మల్లాపూర్, మామిడి గూడ (జి), డోన్గర్ గావ్ గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద మొదటి విడతగా ఎంపిక చేశారు.

నేడే రైతులకు అవగాహన సదస్సు...

ఇంద్రవెల్లి మండలంలో పైలట్ ప్రా జెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల రైతులకు డిజిటల్ సర్వేపై అవగాహన సద స్సును ఈ నెల 5న కేస్లాపూర్ లోని రై తు వేదికలో ఏర్పాటు చేశాం. ఈ అవగాహన కార్యక్రమంలో రెవెన్యూ అధికా రులు డిజిటల్ సర్వేపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు సర్వేకు శ్రీకా రం చుడుతారు. రైతులు సర్వేకు సహకరించాలి.

తహసీల్దార్ ప్రవీణ్ కుమార్