14-06-2025 07:45:46 PM
ఘట్ కేసర్: ఈనెల 17వ తేదీన 4వ తరగతిలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్(Telangana State Sports School)లో ప్రవేశం కొరకు మండల స్థాయి సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాధికారి శ్రీధర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఘట్ కేసర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జరుగనున్న ఈ సెలక్షన్స్ కు 3వతరగతి ఉత్తీర్ణులై, 2016 సెప్టెంబర్ 1 నుండి 2017 ఆగష్టు 31 మధ్యన జన్మించిన వారు అర్హులన్నారు.
బోనోఫైడ్ సర్టిఫికెట్, 3వతరగతి ప్రోగ్రెస్ కార్డు మరియు 5 పాస్ పోర్ట్ ఫోటోలతో ఈనెల 15న ఉదయం 9.30 గంటలకు ఘట్ కేసర్ జెడ్పీ బాలుర పాఠశాలలో రిపోర్ట్ చేయాలన్నారు. పూర్తి వివరాల కోసం వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరాములు (96405 01084) ను సంప్రదించాలని తెలిపారు. టిజిఎస్ఎస్. తెలంగాణ. జిఓవి. ఇన్ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి శ్రీధర్ తెలియజేశారు.