09-02-2026 06:17:47 PM
మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం ను సోమవారం ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు ఉపాధ్యాయులుగా అధికారులుగా వేషధారణలో చూపరులను ఆకట్టుకున్నారు. కలెక్టర్గా జే భాగ్యలక్ష్మి డీఈవోగా లక్ష్మీ ప్రసన్న ఎంపీడీవో గా శాంతి ప్రియ తాసిల్దారుగా ఆదిత్య ఎంఈఓగా దీక్షిత్ హెడ్మాస్టర్ గా మనీ చందు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ గా వైష్ణవి ఏఈ పీసీ చైర్మన్గా యశ్వంత్ ఉపాధ్యాయులుగా శివాని మోక్ష మయూరి నిఖిల్ వినయ్ తమ తమ బాధ్యతలను చక్కగా నిర్వహించి ఆహుతులను అలరింప చేశారు అనంతరం కార్యక్రమంలో భాగంగా పాఠశాల సిబ్బంది ప్రోత్సాహక బహుమతులను విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి శ్రీశైలం ఉపాధ్యాయురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు.