4 July, 2026 | 12:58 AM

ఇదే నెలలో వదలా

04-07-2026 12:00 AM

సినీయర్ నటుడు జగపతిబాబు ఇప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అకెళ్ల వీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబుతోపాటు లయ, హృతిక శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరిత చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే  ఫస్ట్ గ్లింప్స్, టీజర్ విడుదలయ్యాయి. ఈ చిత్రం జూలై 17న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం పంచుకున్న కొత్త పోస్టర్.. ఈ సినిమా మిస్టీరియస్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. మేకర్స్ త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయను న్నారు. ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కార్తీక్ కొడకండ్ల సంగీతం సమకూరుస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, లక్ష్మీ భూపాల కథా రచయితగా, బజ్జా బ్రహ్మయ్య ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.