4 July, 2026 | 12:56 AM

ఏముందో ఏమో..

04-07-2026 12:00 AM

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీవాణీనాథ్, యశ్వంత్‌రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది.  తాజాగా మేకర్స్ ‘ఏముందో ఏమో’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రేమ, ఎదురుచూపుల భావాలను ఎంతో అందంగా ఆవిష్కరిస్తోందీ మెలోడీ. గ్యాని స్వరపర్చిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా, హరిచరణ్ పాడారు. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని; డీవోపీ: రమేశ్ కుశేందర్‌రెడ్డి; ఎడిటర్: వరప్రసాద్; ఆర్ట్: భూపతి యాదగిరి.