14 May, 2026 | 9:57 PM

మంథనిలో విషాదం.. వడదెబ్బతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి

24-04-2026 10:07 AM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణానికి చెందిన గంధం నగేష్,(55) శ్రీ రామ ఫోటో స్టూడియో యజమాని, వడ దెబ్బతో ఆకస్మికంగా మృతి చెందాడు. విధినిర్వహణలో ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి  కర్ణ వేద కార్యక్రమానికి ఫోటోలు తీసి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చే క్రమంలో కస్మాత్తుగా పడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు మంథని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఫోటోగ్రాఫర్ నగేష్, మృతి పట్ల మంథని పట్టణంలోని ఫోటోగ్రాఫర్ల యూనియన్ నాయకులు దిగ్బాంతి వ్యక్తం చేశారు.