calender_icon.png 20 January, 2026 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ ఫొటో జర్నలిస్టు విద్యాసాగర్ మృతి

20-01-2026 12:00:00 AM

ముషీరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎం. విద్యాసాగర్ (63) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అప్పటికే విద్యాసాగర్ మరణిం చినట్టు వైద్యులు ధృవీకరించారు. విద్యా సాగర్ కు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. విద్యాసాగర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. విద్యాసాగర్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సం ఘం నాయకులు కె.అనిల్ కుమార్, నక్కా శ్రీనివాసులు, రజినీ కాం త్, శ్రీనివాస్, బిహెచ్ సలీం, జాన్, సుధీర్ తదితరులు సంతాపాన్ని, ఆయన కుటుం సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.