22 July, 2026 | 3:54 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష   •   ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •  

ఉభయ రాష్ట్రాల్లో ‘ఐక్య ధైర్య సేన సమితి’ సేవలు

18-05-2026 01:28 AM

తన పుట్టినరోజు సందర్భంగా ‘రా కింగ్’ మనోజ్ మంచు, ఆయన భార్య మౌనిక భూ మా మంచు కలిసి హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో రక్తదాన శిబిరం సమావే శాన్ని నిర్వహించారు. తమ కొత్త సామాజిక సేవా సంస్థ ‘ఐక్య ధైర్య సేన సమితి’ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని, మనోజ్, మౌనికలను అభినందించారు.  అనంతరం మనోజ్ మంచు మాట్లాడుతూ.. ఈ సంస్థ ఆలోచన ఎలా వచ్చిందో వివరిస్తూ, సమాజానికి సేవ చే యాలనే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యం తో ఈట్రస్టును ప్రారంభించామని చెప్పారు. ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ని ప్రతి గ్రామానికి ఈ సేవా కార్యక్రమాలను తీసుకెళ్తామని తెలిపారు.