calender_icon.png 7 December, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ ఏర్పాటు

07-12-2025 12:00:00 AM

ఇతర ప్రాంతాలకు తరలించాలి

ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ పంచాక్షరికి ద్వారకానగర్ కాలనీవాసుల ఫిర్యాదు

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా ద్వారకా నగర్ కాలనీ షేక్‌పేట జూబ్లీహిల్స్ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైన్సును ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతూ శనివారం నాం పల్లిలోని అబ్కారీ భవనంలో ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ పంచాక్షరిని కలిసి కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ద్వారక నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ రమేష్ యాదవ్, జనరల్ సెక్రెటరీ ఆర్ గోవింద్, ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం గుడి, బడికి 100 మీటర్ల దూ రంలో వైన్సును ఏర్పాటు చేయాలి.

వాటిని తుం గలో తొక్కి హనుమాన్ దేవాలయ సమీపంలో 74 మీటర్ల పరిధిలో ఏర్పాటు చేసేందుకు చర్య లు తీసుకుంటున్నారని ఆరోపించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిల్ దాఖలు చేయడంతో న్యాయస్థానం కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. 100 మీటర్ల తర్వాతేనే వైన్స్ ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ సదరు వ్యాపారి పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక్కడ హనుమాన్ దేవాలయం, కళాశాల, పాఠశాలలో ఉన్నప్పటికీ, ప్రతిరోజు మహి ళలు, యువతులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు. వెంటనే ఎక్సైజ్ శాఖ స్పందించి వైన్స్ ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఈ విషయంపై హైదరాబాద్ జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ద్వారకా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఎం నరేష్ యాదవ్, ఎస్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.