calender_icon.png 7 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెహ్రూ చరిత్ర కనుమరుగుకు బీజేపీ కుట్ర!

07-12-2025 12:00:00 AM

  1. రాముడి విగ్రహం పెట్టుకొని ఓట్లేసుకుంది మోదీ
  2. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): దేశంలో త్యాగాలు చేసిన నెహ్రూ చరిత్రను కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. గాంధీ కుటుంబం రాజకీయం చేయలేదని, కేవలం దేశానికి స్వాతంత్య్రం తేవడం టార్గెట్‌గా పెట్టుకుని పని చేశారని తెలిపారు. శ్రీరాముడి ఆలోచన.. ఆదర్శాలకు అనుగుణంగా పరిపాలించిన చరిత్ర మహాత్మా గాంధీ.. నెహ్రూలదన్నారు.

శ్రీరాముడి విగ్రహం ముందు పెట్టుకుని ఓట్లేసుకుని ప్రధాని అయిన చరిత్ర మోదీదని విమర్శించారు. నెహ్రూ ప్రధాని అయిన తరువాత ప్రణాళికబద్దంగా ఆర్థిక పురోగతికి ప్రాధాన్యత ఇచ్చేవారని, లౌకిక వాదంను ఆయన విశ్వసించేవారని గుర్తు చేశారు. నెహ్రూ త్యాగాలను మరిపించడానికి వారిపై బీజేపీ నేతలు చేడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానిగా నెహ్రూ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు.

అప్పుడు ప్రజలు ఏక తీర్మానంతో నెహ్రును ప్రధానిగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు రెండు పర్యాయాలు ఓటింగ్ మిషన్ లు  తమంతట తాము ఓటు వేసుకున్నాయని, అందుకే బీజేపీ అధికార ంలోకి వస్తుందని ఆరోపించారు. జనాల్లోకి బ్యాంక్ సేవలను తీసుకు వచ్చింది ఇందిరా గాంధీ అని గుర్తు చేశారు.

నెహ్రూ ఆలోచనలు, పరిపాలన, వారి భావాలను అనుసరించి పదేళ్లు యూపీఏ చైర్మన్‌గా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌తో పాలన చేయించారలని చెప్పారు. దేశ ప్రజలకు 56 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఏం చేశామో వందల అభివృద్ధి పనులు మేం చెప్పగలమని, పదకొండేండ్లలో మోదీ ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.