ఓటింగ్ శాతం పెంచేలా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్
కరీంనగర్, జనవరి 14 (విజయ క్రాంతి): నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే ప్రాధాన్యతగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీస్కుంటున్నామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కమిషనర్ మాట్లాడుతూ... రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనలను అనుసరించి... ఓటర్లకు పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీస్కుంటున్నామని తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను మొదటి ప్రాధాన్యత గా పరిగణలోకి తీస్కోని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
అవి సరిపోని యెడల ప్రైవేటు విద్యా సంస్థల భవనాలను పరిగణలోకి తీస్కోని ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలింగ్ కేంద్రాల జాబితాను మ్యాపింగ్ చేశామన్నారు. నగర వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వేగవంతంగా జరిగేలా ప్రతి పోలింగ్ బూత్ వారిగా 800 ఓటర్లకు మించకుండా తగిన చర్యలు తీస్కున్నామని తెలిపారు. 15న సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్న నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం లో స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
16న డివిజన్ల పోలింగ్ స్టేషన్ వారిగా ఓటర్ల జాబితా తో పాటు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. తదనంతరం ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనలను అనుసరించి మిగితా ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగర అద్యక్షులు అంజన్ కుమార్, బీజేపి నాయకులు నాంపల్లి శ్రీనివాస్, ఎంఐఎం నాయకులు అబ్బస్ సమీ, అసీం, బిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్, మాజీ కార్పోరేటర్ కంసాల శ్రీనివాస్, కాంగ్రేస్ నాయకులు పిట్టల శ్రీనివాస్, అబ్ధుల్ రహెమాన్, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు బండారి శేఖర్, జనసేనా నాయకులు రాజిరెడ్డి, హరిష్, టీడిపి నాయకులు ఎర్ర వెళ్లి రవీంధర్, బిఎస్పీ నాయకులు నల్లాల శ్రీనివాస్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.




