20 June, 2026 | 4:05 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

మోడల్‌గా నిలిచేలా సెట్విన్ కేంద్రం

18-04-2025 12:00 AM

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

వారాసిగూడ ఏప్రిల్ 17 (విజయక్రాంతి): సీతాఫలమండీలోని సెట్విన్ శిక్షణా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఓ మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, మరో రెండు అంతస్తుల్లో భవన సముదాయాన్ని నిర్మించి కొత్త ట్రేడ్‌లలో శిక్షణను కల్పిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. గురువారం ఆయన సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్ధులు, సిబ్బందితో ముచ్చటించారు.  బ్యుటీ షియన్, కంప్యూటర్, ఫాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్ మెంట్, మొబైల్ రేపైరింగ్, సీసీ కెమెరా రేపైరింగ్ విభాగాల కార్యకలాపాలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ళ క్రితం సితాఫలమండీలో నెలకొల్పిన సెట్విన్ శిక్షణా కేంద్రం తన ప్రత్యేకతను చాటుకుంటుందని తెలిపారు. త్వరలో దీని కార్యకలా పాలు విస్తరిస్తామని తెలిపారు. విద్యార్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం  ఇంచార్జ్ అనిత తదితరులు పాల్గొన్నారు.