calender_icon.png 19 February, 2026 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాలాల్ జయంతివేడుకలు ఘనంగా నిర్వహించాలి

18-02-2026 12:21:13 AM

కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) :ఫిబ్రవరి 19న మెదక్, 20న నర్సాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించేసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతివేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ ఆధ్వ ర్యంలో బంజారా సంఘం నాయకులతో ఏర్పాటుచేసిన సమీక్షలో అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..

బంజారా సంఘం నాయకు లు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు నియోజకవర్గాల్లోని శాసనసభ్యులను ఆహ్వానించుకొని ప్రజా ప్రతినిధులు ప్ర భుత్వపరంగా చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రాలలో శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టాలని, పెద్ద ఎత్తున శోభాయాత్రలు, సే వాలాల్ మహారాజ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో బంజారా గిరిజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.