06-10-2025 12:29:15 AM
కొట్టుకుపోయిన ప్రసాదం కౌంటర్, ఆలయం ముందు రేకులు
తీవ్రంగా ధ్వంసమైన గ్రిల్స్
నష్టాన్ని పరిశీలించిన సిబ్బంది
పాపన్నపేట, అక్టోబర్5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి ఇటీవల వచ్చి న మంజీరా వరదలతో భారీ నష్టం చేకూరింది. గతంలో ఎన్నడూ లేనంతగా వరద పోటెత్తడంతో వనదుర్గ ఆలయం నీటి ప్రవాహంలో చిక్కుపోయింది. దీంతో ఆలయ అధికారులు దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు వ న దుర్గమ్మ దర్శనం కల్పించారు. మంజీరా నది మహోగ్ర రూపం దాల్చడంతో ఏడుపాయల ఆలయం అతలాకుతలమైంది. ప్రసా ద విక్రయ కేంద్రం షెడ్డు, ఆలయం ముందు రేకులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయా యి. ప్రధాన ఆలయం మండ పం గ్రిల్స్, జాలీలు, యాగశాల గ్రిల్స్, క్యూ లైన్ గ్రిల్స్, రేకులు, గ్రానైట్ బండలు, టైల్స్ ధ్వంసమయ్యాయి. పైనుంచి వరద ప్రవాహంలో కొట్టుకు వచ్చిన వ్యర్థాలు, చెట్ల కొమ్మలు ఆలయం మండపం గ్రిల్స్‌కు తట్టుకొని పేరుకుపోయాయి.
ఆలయ ముఖ చిత్రం అస్తవ్య స్తంగా మారింది. 2016 తర్వా త ఈసారి ఆలయాన్ని ఎక్కువ రోజులు మూసివేశారు. ఆగస్టు 14న ఆల యం జలదిగ్బంధంలోకి వెళ్లి సుమారు 52 రోజుల పాటు ఆలయం మంజీరా ఉధృతిలో ఉండిపోయింది. దీ ంతో రాజగోపురంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. రెండు రోజుల నుంచి వరద ఉధృతి తగ్గడంతో ఆలయం జలదిగ్బంధం నుంచి విముక్తి పొందింది.
ఆదివారం సిబ్బ ంది ఆలయానికి వెళ్లి పరిశీలించగా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. ఆలయాన్ని శుద్ధి చేసే పనిని ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇంకా భక్తులకు ఆలయంలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. ఆలయ పరిసరాలు శుభ్రం చేయడానికి రెండు రోజుల సమ యం పడుతుందని సిబ్బంది చెబుతున్నారు.