22 June, 2026 | 1:31 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

ఏడు రష్యా ఆయిల్ ట్యాంకర్లు యూ-టర్న్

19-03-2026 12:00 AM

న్యూఢిల్లీ, మార్చి 18: చైనాకు వెళ్లాల్సిన ఏడు రష్యా ఆయిల్ ట్యాంకర్ల నౌకలు యూటర్న్ తీసుకుని, అవి భారత్ వైపు వస్తున్నాయి. పశ్చిమాసియ దేశాల్లో  తీవ్ర ఉద్రి క్తతల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలుకు అమెరికా మినహాయింపు ఇచ్చింది. దీంతో రష్యా చమురును చైనాకు తీసుకువెళ్తున్న ఈ నౌకల మార్గాన్ని భారత్‌కు మళ్లించారు. షిప్-ట్రాకింగ్ సంస్థ వోర్టెక్సా లిమిటెడ్ పర్యవేక్షిస్తున్న .

ఈ నౌకల మార్గాన్ని మళ్లించినట్లు బ్లూమ్‌బెర్గ్ బుధవారం వెల్లడించింది. ఈ ఏడింటిలో, మధ్య తరహా ముడి చమురు ట్యాంకర్ అయిన ఆక్వా టైటాన్ శనివారం (మార్చి 21) న్యూ మంగళూరు పోర్టుకు చేరుకోనుంది. మరో ట్యాంకర్, సూయజ్‌మ్యాక్స్ జౌజౌ ఎన్, కూడా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న సిక్కా పోర్టు వైపు పయనిస్తోంది. ఇది మార్చి 25న అక్కడికి చేరుకుంటుందని అంచనా.