06-07-2025 01:31:12 AM
ఇంగ్లండ్ టార్గెట్ 608 పరుగులు
బర్మింగ్‌హమ్, జూలై 5: బర్మింగ్‌హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతు న్న రెండో టెస్టులో టీమిండియా గెలు పు దిశగా పయనిస్తోంది. నాలుగో రో జు ఆట ముగిసే సమయానికి ఇం గ్లండ్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఏడు వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపుకు మరో 536 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు భారత్ తన రెండో ఇన్నిం గ్స్‌ను 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (161) మరోసెంచరీతో కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధి క్యం కలుపుకొని మొత్తం ఇంగ్లండ్ ముందు 608 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కా గా ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డ బుల్ సెంచరీ సాధించిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో మెరిసి ప లు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.
కెప్టెన్‌గా తన తొలి రెండు టె స్టుల్లోనే మూడు శతకాలు బాదిన రె ండో భారత క్రికెటర్‌గా గిల్ నిలిచాడు. ఇంతకముందు ఈ రికార్డు విరాట్ కో హ్లీ పేరిట ఉంది. భారత కెప్టెన్‌గా ఒక టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గానూ రికార్డులకెక్కాడు. గతంలో గా వస్కర్ (1978), కోహ్లీ (2014)లో ఈ ఘనత అందుకున్నారు.