05-07-2025 01:52:25 AM
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆధ్వర్యంలో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న 944 కాంట్రాక్టు, 1,332 ఔట్ సోర్సిం గ్, 87 మంది మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) ఉద్యోగులను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కొనసాగిస్తు న్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వీరి సేవలు ఏడాది కాలం లేదా రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసేవరకు కొనసాగిస్తారు.