24-05-2025 12:00:00 AM
గర్భం దాల్చిన వైనం
మేడ్చల్, మే 23 (విజయ క్రాంతి): మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో ఒక వ్యక్తి కూతురు వరస బాలిక(13)పై లైంగిక దాడి చేయగా గర్భం దాల్చింది. పోలీసుల కథనం ప్రకారం ఒక మహిళ శ్రీకాంత్ అనే వ్యక్తిని 8 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకుంది. ఆ మహిళకు అప్పటికే ఒక కూతురు ఉంది.
తండ్రిగా చూసుకోవాల్సిన వ్యక్తి ఆ బాలికపై కన్నేశాడు. జనవరిలో ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. భయపడిన బాలిక ఎవరికి చెప్పలేదు. ఇటీవల మళ్ళీ ఇంకొక దాడికి పాల్పడ్డాడు. అనారోగ్యం పాలైన బాలికను తల్లి మేడ్చల్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లింది.
ఆసుపత్రిలో పరీక్షలు చేయగా బాలిక గర్భవతి అని తేలింది. దీంతో తల్లి, అత్తమ్మ బాలికను అడగగా జరిగిన సంఘటనను చెప్పింది. దీం తో శ్రీకాంత్ పై మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫి ర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు శ్రీ కాంత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.