calender_icon.png 24 May, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

24-05-2025 12:00:00 AM

ముషీరాబాద్, మే 23 (విజయక్రాంతి): ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.దోమలగూడ ఎస్‌ఐ పి. నిరంజన్ తెలిపిన వివరాల ప్రకా రం.

కవాడిగూడ డివిజన్ దోమలగూడ ఎన్టీఆర్ స్టేడి యం సమీపంలో గల బీమామైదాన్‌కు చెందిన బుర్ర కృష్ణ (39) అనే వ్యక్తి ఈనెల 22న బీమా మైదాన్ క్వార్టర్స్ లోని ఎస్‌ఎఫ్-118 రెండవ అంతస్తులో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మృతుడు కుటుంబ కలహాలు, నిరాశ కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మృతుడి బంధువులు నోముల వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నిరంజన్  వెల్లడించారు.