23-05-2025 11:12:58 PM
-ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, మే 23 (విజయక్రాంతి) : సమస్యల పరిష్కారానికి ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. డివిజన్‌లో ఎలాంటి సమస్యలున్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ లోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్ లో బస్తీ వాసులను సమస్యలు అడిగి తెలుసుకుంటు న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ డివిజన్లో సమస్యల పరిష్కారానికి అధికారులు నాయకులు కృషి చేయాలన్నారు.
ఎక్కడ ఏ సమస్య ఏర్పడ్డ వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ యువ నాయకుడు ముఠా జైసిం హ, డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్రీహరి, వాసు, రాజు యాదవ్, బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు.