11 August, 2026 | 4:45 PM

200 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో ఘనంగా తిరంగా ర్యాలీ

11-08-2026 04:11 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో,హర్ ఘర్ తిరంగా కన్వీనర్ ఉషణ అన్వేష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన తిరంగా ర్యాలీలో సుమారు 2,000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 200 మీటర్ల పొడవైన భారీ త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు చేతబట్టి పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.

దేశభక్తి నినాదాలతో పట్టణం మార్మోగింది.ఈ కార్యక్రమానికి అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి , రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి , ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మీసా అర్జున్ రావు లు హాజరైనారు, ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయ జెండా భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, త్యాగాలకు ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.