calender_icon.png 5 December, 2024 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికపై లైంగిక దాడి

02-11-2024 01:51:42 AM

ఐదుగురిపై పోక్సో కేసు.. రిమాండ్‌కు తరలింపు  

వికారాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. పరిగి నియోజక వర్గం దోమ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 8వ తరగతి బాలికపై వారం రోజుల క్రితం అదే ఊరికి చెందిన ఐదుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు.

తొలుత ముగ్గురు పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడగా, తర్వాత వారి స్నేహితులు ఇద్దరు తనపై అఘాయిత్యం చేసినట్లు బాధితురాలు పోలీసులకు వివరించింది. బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆరాతీయగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో వారు దోమ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐదుగురిపై పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి తెలిపారు. కాగా, నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం.