19 July, 2026 | 3:42 AM

విద్యార్థినులపై లైంగిక వేధింపులు

19-07-2026 01:04 AM

బాన్సువాడ, జూలై 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఓ ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు గోపాల్, పవన్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు చేసిన ఘటన కలకలం రేపింది. పలువురు విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

స్పందించిన అధికారులు విచారణ చేపట్టగా  విద్యార్థినుల ఆరోపణలు నిజమేనని తేలడంతో ఆ ఇద్దరు ఉపాధ్యాయులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు డీఈవో మల్లికార్జున్ తెలిపారు. అలాగే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేశారు.