10-12-2025 02:49:22 AM
జీతాలు పెంచకుండా వేధింపులు గురి చేస్తున్నారంటూ ఆందోళన
ఉప్పల్. డిసెంబర్ 9 (విజయక్రాంతి) : ఎంతో కాలంగా పనిచేస్తున్న జీతాలు పెంచకుండా కంపెనీ యజమాన్యం కంపెనీ జనరల్ మేనేజర్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ నాచారం పారిశ్రామిక వాడ షాహి కంపెనీ మహిళా కార్మికులు ఆందోళన దిగారు. కంపెనీ ఎదుట రోడ్డుపై బైఠాయించి జీతాలు పెంచాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కంపెనీ మొదలు పెట్టినప్పటి నుండి తమ పని చేస్తున్నామని జీతాలు పెంచకుండా మా కష్టాన్ని దోచుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
కంపెనీ జనరల్ మేనేజర్ మహిళలని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపుల గురి చేస్తున్నారని వారు వాపోయారు. చాలీచాలని జీతాలతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందని వారు ఆందోళన వ్యక్తపరిచారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నాచారం పరిశ్రమ వాడలోని షాహి ఎక్స్ పోర్ట్ కంపెనీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బోసు అన్నారు.
కార్మికులు చేసిన ధర్నాకు సిపిఐ అండగా ఉం టుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితు ల్లో కనీస వేతనం 26 వేలు ఉన్నప్పటికీ షాహి కంపెనీ పది సంవత్సరాల నుంచి పని చేస్తున్న కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తూ మోసపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటని, మహిళ కార్మికుల పట్ల మానసికంగా చిత్రహింసలు పెట్టడం బాధాకరమ న్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మండల కార్యదర్శిఉప్పల్ మండల కార్యదర్శి సత్యప్రసాద్ సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు ధర్మేంద్ర గిరిబాబు రాజే ష్ కౌశిక్ మున్ని స్వప్న రమ్య పాల్గొన్నారు.
ధర్నాలో పాల్గొన్నఅరుణోదయ విమలక్క
షాహి ఎక్స్ పోర్ట్ కంపెనీ కార్మికుల మద్దతుగా అరుణోదయ సాంస్కృతి సంఘం నాయకురాలు విమలక్క మద్దతు తెలిపారు. కార్మికులతో పాటు ధర్నాలో విమలక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కార్మికులపై షాహి ఎక్స్పోర్ట్ కంపెనీ ప్రవర్తిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా శ్రమకు తగ్గ వేతనం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.