బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా శైలజ
27-12-2025 08:58 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన ఉప్పల్ జోన్ లోని బోడుప్పల్ సర్కిల్ (10)కు డిప్యూటీ కమిషనర్ గా ఏ. శైలజ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్జాదిగూడ సర్కిల్ ను బోడుప్పల్ సర్కిల్ లో విలీనం చేయగా. పీర్జాదిగూడ సర్కిల్ కి సంబంధించిన రికార్డులను అక్కడ డిసి త్రిలేశ్వర్ రావు బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ. ఎమ్.సి. శ్యాంసుందర్రావు, మేనేజర్ ప్రవీణ్ కుమార్, క్రాంతి, స్టాప్ తదితరులు పాల్గొన్నారు.






