calender_icon.png 27 December, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్లు లక్ష సాధనలో ముందుండాలి

27-12-2025 09:02:51 PM

పోస్టల్ ఇన్స్పెక్టర్ వీరన్న

ములకలపల్లి,(విజయక్రాంతి): మండలంలోని తాళ్లపాయి బ్రాంచ్ కార్యాలయాన్ని  పోస్టల్ ఇన్స్పెక్టర్ మాలోత్ వీరన్న వార్షిక తనిఖీలో భాగంగా శనివారం పరిశీలించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్రాంచ్ కార్యాలయంలో జరిగిన వివిధ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. అంతేకాకుండా ఖాతాదారుల నుండి పాస్ పుస్తకాలను తెప్పించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బ్రాంచి పోస్ట్మాస్టర్ కు అనేక సూచనలు చేయటం జరిగింది.

గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో ఖాతాలను తెరచి కొత్తవారికి ఆదర్శంగా ఉండాలన్నారు. కార్యాలయంలో పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలకు సంబంధించి సమాచారాన్ని ప్రదర్శించే బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పెన్షన్లు, రైతు బీమా, రైతు బంధు వంటి నగదు లావాదేవీలను సైతం రైతులు, గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వారిని చైతన్యం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎస్ బి జి తిలక్ ఉన్నారు.