27-12-2025 08:56:08 PM
కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని పలు అల్ట్రా సౌండ్ కేంద్రాలను, ఫీటల్ మెడిసిన్ కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ టీం సభ్యులతో కలిసి తనిఖీ చేశారు. రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, కేస్ రికార్డ్స్, సంబంధిత డాక్యుమెంట్స్, ఫామ్ (ఎఫ్) పత్రాలు అన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సనజవేరియా, సయ్యద్ సాబీర్, రమేష్, పాల్గొన్నారు.