6 May, 2026 | 8:44 PM

Breaking News

లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •  

సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైంది

10-12-2024 05:17 PM

సీఎం కు మాజీ మంత్రి రామన్న సూటి ప్రశ్న..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులకు గంటలోపు రెగ్యులర్ జీవో విడుదల చేస్తామన్నా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు కొనసాగిస్తున్న దీక్ష శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రి రామన్న మాట్లాడుతూ ఉద్యోగులు చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంద్దన్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో సమస్యలపై ప్రస్తావించేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.