calender_icon.png 21 November, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షంషేర్ నితీశ్!

21-11-2025 12:00:00 AM

పదోసారి.. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణం

27మంది మంత్రులతో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్

* కొందరు ‘పాల్తూ చాచా’ అన్నారు.. ఇంకొందరు ‘కుర్సీ కుమార్’ అని ఎద్దేవా చేశారు.. మరికొందరు ‘స్థిరత్వం లేని మనిషి’ అని పిలుస్తారు.. కానీ ఎంతమంది ఎన్ని విధాలుగా విమర్శలు చేసినప్పటికీ ఆయన మాత్రం బీహార్‌కు ఎన్నడూ ‘సుశాసన్ బాబు’గానే గుర్తుండిపోతారు. ఒకప్పుడు బీహార్ అంటే దోపిడీలకు, దౌర్జన్యాలకు పెట్టింది పేరు. అలాంటి బీహార్‌ను తన పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ప్రజల జీవితాలను చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చి గొప్ప ముఖ్యమంత్రిగా ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆయనే బీహార్ కాషంషేర్.. నితీశ్ కుమార్. 7౪ ఏళ్ల వయస్సులోనూ రికార్డు స్థాయిలో పదోసారి బీహార్ సీఎంగా ఎన్నికైన ఆయన తన పాలనలో అభివృద్ధి పరంగా బీహార్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్నారు.

పట్నా, నవంబర్ 20: నితీశ్ కుమార్ ఒక గొప్ప రాజకీయవేత్త. పరిణామాలు ఎలా మారుతున్నాయో ఆయన పసిగట్టినంతగా మరెవరికీ అది సా ధ్యం కాలేదు. ప్రత్యర్థుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వాటిని పటాపంచలు చేస్తూ తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు రాబట్టారు. తాజాగా రికార్డు స్థాయిలో పదోసారి బీహార్ సీఎం కుర్చీని అధిరోహించిని నితీ శ్ పాలనను మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం పరిశీలించి చూస్తే..

‘లోక్ నాయక్’ జేపీ చొరవతో..

నితీశ్ కుమార్ 1951లో పట్నా సమీపంలోని భక్తియార్‌పుర్‌లో జన్మించారు. ఆయన తండ్రి కవిరాజ్ రామ్‌లఖన్ సింగ్ స్వాతంత్ర సమరయోధుడు, ఆయుర్వేద వైద్యుడు. ఆయన తల్లి పరమేశ్వరి గృహిణి.  ప్రస్తుత పట్నా ఎన్‌ఐటీలో ని తీశ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తిని పెంచుకున్న నితీశ్ కుమార్ చదువు పూర్తయ్యాక కొంతకాలం రాష్ట్ర వి ద్యుత్ బోర్డులో ఉద్యోగం చేశారు.

కానీ రాజకీయాలపై మక్కువతో ఉద్యోగాన్ని వదిలేసి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1974లో  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘లోక్ నాయక్’ జయప్రకాశ్ నారాయణ్ ప్రా రంభించిన సంపూర్ణ విప్లవంలో నితీశ్ కుమార్ పాల్గొన్నారు. అదే సమయంలో ప్రస్తుత ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, దివంగత బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీలతో నితీశ్‌కు పరిచయం ఏర్పడింది. 

కేంద్ర మంత్రిగా చెరగని ముద్ర

ఎన్డీఏ సర్కారులో నితీశ్ కుమార్ రైల్వే, వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే ఇంటర్నెట్‌లో టికెట్ బుకింగ్స్, తత్కాల్, రైల్వే బుకింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి నిర్ణయాలతో చెరగని ముద్ర వేశారు. 1999లో బెంగాల్‌లో జరిగిన ఒక రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. 2004లో కేంద్రంలో ఎన్డీయే ఓటమి పాలవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చారు. 

అభివృద్ధి పథంలో బీహార్..

2000 సంవత్సరంలో తొలిసారి సీఎం అయిన నితీశ్ కుమార్ కేవలం వారం రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. అయితే 2005లో రెండోసారి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి  చేపట్టినప్పుడు బీహార్‌లో శాంతి భద్రతలు నశించి, దెబ్బతిన్న రోడ్లతో అభివృద్ధికి చాలా దూరంగా ఉంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కావడంతో నితీశ్ తనదైన వ్యూహాలతో అనేక సంస్కరణలను తీసుకువచ్చారు.

ముఖ్యంగా రోడ్లు, విద్యుదీకరణ మెరుగుపడటంలో నితీశ్ కృషి ప్రశంసనీయం. బీహార్‌లో చీకటి పడ్డాక ఎవరూ బయటకు రారు.. అనే భయానక వాతావరణం నుంచి గ్రామాలను, పట్టణాలతో కలిపే రహదారులను నిర్మించారు. నితీశ్ కుమార్ బిహార్‌లో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం సైతం చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా పలు ఇండస్ట్రియల్ పార్క్‌లను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలను కల్పించారు. సంక్షేమం, మహిళా సాధికారత: నితీశ్ కుమార్ విజయాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలక పాత్ర పోషించారు. పాఠశాల బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. నితీశ్ పదోసారి ముఖ్యమంత్రి కావడంతో పథకాలు కొనసాగడంతో పాటు మరింత పటిష్టమవనున్నాయి.

పొత్తులే ఆయుధంగా.. 

సంకీర్ణ రాజకీయాలకు నితీశ్ కుమార్ పెట్టింది పేరు. అది ఎంతలా అంటే  ‘ఎవరు నితీశ్‌తో ఉంటారో.. వారే గెలుస్తారు’ అనేంతగా బలమైన ముద్ర వేశారు. రాజకీయ చతురతతో తాను ఏ కూటమిలో ఉంటే ఆ కూటమి విజయం సాధించేలా చేయగలిగారు. 1994లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు వ్యతిరేకంగా జార్జ్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో సమతా పార్టీని స్థాపించడంలో నితీశ్‌ది కీలకపాత్ర. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని నిశితంగా పరిశీలిస్తే..

తొలినుంచి పొత్తులే అతడి ఆయుధం. తొలిసారిగా సీఎంగా అయినప్పటి నుంచి నితీశ్ ఏదోఒక పార్టీతో పొత్తుపెట్టుకుంటూనే వస్తున్నారు. 2000 సంవత్సరంలో తొలిసారిగా సీఎం అయిన నితీశ్ మెజారిటీ నిరూపించుకోలేక కేవలం ౭ రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. 2003లో జనతాదళ్(యునైటెడ్)ను స్థాపించారు. 2005లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మళ్లీ నితీశ్ సీఎం అ య్యారు.

ఇక అప్పటినుంచి నితీశ్ కుమార్ వెనుదిరిగి చూడలేదు.బీజేపీతో పొత్తు కారణంగా సీఎం అయిన నితీశ్ తర్వాతి కాలంలో ఆ పార్టీకి దూరమయ్యారు. 2003లో నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటిం చినప్పుడు నితీశ్ ఎన్డీయే నుంచి నిష్ర్కమించారు. 2015లో లాలూ అధినేతగా ఉన్న ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తక్కువ సీట్లు గెలిచినప్పటికీ లాలూ సాయంతో ముఖ్యమంత్రి అయ్యారు.

లాలూ.. నితీశ్‌ను దూరం పెట్టడంతో మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022లో కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని కూటమి సాయంతో సీఎం అయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కన్వీనర్‌గా తన పేరును ప్రకటించకపోవడంతో 2024 జనవరిలో నితీశ్  మళ్లీ ఎన్డీయేలో చేరి సీఎం పదవిని నిలబెట్టుకున్నారు. అధికారమే లక్ష్యంగా ఎన్నిసార్లు పొత్తులను మార్చి నా బిహార్ ప్రజలు మాత్రం నితీశ్‌తోనే ఉండడం విశేషం.

కుమారుడిని రాజకీయాలకు దూరంగా..

అవినీతి మరకులు అంటుతాయనే భయంతో నితీశ్ కుమార్ తన కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ తన కుమారుడి పేరు ఇప్పటికీ చాలా మందికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కాగా నితీశ్ కుమారుడి పేరు నిశాంత్ కుమార్. 

నితీశ్ రాజకీయ ప్రస్థానం..

* 1970లలో జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ఉద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభం.

* 1985లో బీహార్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నిక

* 1989, 91,96,98,99, 2004లో ఎంపీగా ఎన్నిక

* 1998 2004: వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు

* 2000: మొదటిసారి ముఖ్యమంత్రి (కేవలం ఏడు రోజులు మాత్రమే అధికారంలో)

* 2003: సమతా పార్టీ జనతాదళ్ (యునైటెడ్)లో విలీనం

* 2005: బీజేపీ మద్దతుతో నితీష్ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నిక

* 2013: బీజేపీతో పొత్తుకు ముగింపు 

* 2015: లాలూ ప్రసాద్, కాంగ్రెస్‌తో కలిసి మహాగఠ్బంధన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎంపిక

* 2017: తిరిగి ఎన్డీయే గూటికి నితీశ్ కుమార్.. ఆరవసారి ముఖ్యమంత్రిగా

* 2022: బీజేపీతోతో తెగదెంపులు, మహాగఠ్బంధన్‌లో చేరిక.. 

* 2024: మహాగఠ్బంధన్ వీడి తిరిగి ఎన్డీఏలోకి.. తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం

* 2025 :  ఎన్డీఏ కూటమితో పొత్తు.. రికార్డు స్థాయిలో పదోసారి ముఖ్యమంత్రిగా ఎంపిక

గతంలో నిర్వహించిన పదవులు:

* కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

* కేంద్ర రైల్వే శాఖ మంత్రి

* కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి

* లోక్‌సభకు ఆరుసార్లు ఎంపీగా ఎన్నిక

* శాసనమండలి సభ్యునిగానే 9 సార్లు బీహార్‌కు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం.

వ్యక్తిగత వివరాలు

పుట్టిన తేదీ: మార్చి 1, 1951

పుట్టిన స్థలం: బఖ్తియార్‌పూర్ జిల్లా, బీహార్

పార్టీ: జనతాదళ్ (యునైటెడ్) జేడీయూ

విద్య: పట్నాలోని బిహార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ, పట్నా) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

1985లో తొలిసారి అసెంబ్లీకి..

నితీశ్  రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత 1977,80 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. అయితే 1985లో మొదటిసారి హర్నాత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి.. 1989, 1991, 1996, 1998, 1999, 2004లో ఎంపీగా ఎన్నికయ్యారు.

అస్థిర, సంకీర్ణ ప్రభుత్వాలు ఉండడంతో కేవలం 15 ఏళ్ల వ్యవధిలో ఆరు ప్రత్య క్ష ఎన్నికలు ఎదుర్కొని నితీశ్ కుమార్ రాజకీయాల్లో రాటుదేలారు. తన రాజకీయ జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసిన నితీశ్ కుమార్ రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వచ్చాకా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవలేదు. తన పార్టీ శ్రేయస్సు కోసం ఆయన శాసన మండలి మా ర్గాన్ని ఏంచుకున్నారు. ఇప్పటివరకు తాజాగా కలిపి పదోసారి సీఎం అయిన నితీశ్ కుమార్ ఎమ్మెల్సీగానే రాష్ట్రాన్ని పరిపాలించడం విశేషం.