21-11-2025 12:00:00 AM
-తీర్పును స్వాగతిస్తున్నా: బండి సంజయ్
-చేయని తప్పుకు నన్ను జైలుకు పంపారన్న కేంద్ర మంత్రి
-కక్ష సాధింపు చర్యలకు ఫలితం ఉంటుందని వ్యాఖ్య
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): కేంద్రమంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2023లో పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో బండి సంజయ్‌పై కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదైంది. అయితే రాజకీయ కక్షతోనే బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారని బండి సంజయ్ తరఫు న్యాయవాది కోర్టుకు పేర్కొన్నారు. దీనిపై కోర్టు....కేసు నమోదులో సరైన సెక్షన్లు, దర్యాప్తులో పూర్తి వివరాలు లేవని పేర్కొంటూ కొట్టి వేసింది.
తీర్పును స్వాగతిస్తున్నా: బండి సంజయ్
టెన్త్ పేపర్ లీక్ కేసును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం ఒక ప్రకటనలె తెలిపా రు. చేయని తప్పుకు తనను జైలుకు పంపారని, మానవత్వం మరిచి నాపట్ల, బీజేపీ కార్యకర్తల పట్ల క్రూరంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తనను రోడ్లపై తిప్పుతూ ఏదో చేద్దామనుకున్నారని, కార్యకర్తల ధాటికి తట్టుకోలేక జైలుకు పంపారని, టెన్త్ హిం దీ పేపర్‌ను ఎవరైనా లీక్ చేస్తారా? అంటూ జనం నవ్వుకున్నారన్నారు.
ఇన్ని కేసుల విషయంలో కోర్టుల చుట్టూ తిరగలేక ఇబ్బం ది పడుతున్నా... అయినా భరిస్తున్నా, కేసీఆర్ ప్రభుత్వ మెడలు వంచిన పార్టీ బీజేపీ అనే తృప్తి తనకు మిగిలిందన్నారు. ఈ పాపం ఊరికే పోదు...కక్ష సాధిం పు చర్యలకు ఫలితం ఉంటుందని, తనపై మోపిన కేసులన్నీ అక్రమమైనవని ఈ కోర్టు తీర్పు ద్వారా నిరూపితమైందని పేర్కొన్నారు. ఆరోజు తనకు అండగా ఉన్న అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ జాతీయ నాయకత్వానికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
హైకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు: డీకే అరుణ
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఉన్న టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసు హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ తీర్పు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెంప పెట్టు అని బీజే పీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి నిరాధారమైన కేసుగా తోసి పుచ్చిన హైకోర్టు బండి సంజయ్‌ని నిర్దోషిగా తేల్చిందని తెలిపారు.
బండి సంజ య్‌పై ఉన్న ద్వేషంతో నాటి కేసీఆర్ ప్రభు త్వం అకారణంగా కేసులు పెట్టి వేధించిందని, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన బండి సంజయ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేటీఆర్ దిగజారి వ్యవహరించారని మండిపడ్డారు. ఆనాడు బీజేపీకి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక సంజయ్‌పై కేటీఆర్ వంద లాది కేసులు పెట్టి వేధించారన్నారు. కోర్టు తీర్పుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందిస్తూ టెన్త్ పేపర్ లీకేజీ పేరుతో బండి సంజయ్‌పై వేసిన కేసు తప్పుడు కేసు అని తేలిపోయిందన్నారు. బండి సం జయ్‌పై గత ప్రభుత్వం చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని మరో ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.