09-05-2025 01:15:11 AM
జహీరాబాద్, మే 8 : ఝరాసంఘం మండలం బర్దిపూర్ గ్రామంలో గల శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శనేశ్వర జయంతి మహోత్సవాలకు రావలసిందిగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కోరారు. గురువారం ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ హరీష్ రావు నివాసంలో కలిసి ఈ నెల 27న జరిగే శనీశ్వర జయంతి మహోత్సవాలకు రావలసిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మహామండలేశ్వర సిద్దేశ్వరానందగిరి మహారాజును సాదరంగా ఆహ్వానించి పూలమాల శాలువాతో సన్మానించారు. శనీశ్వర జయంతి ఉత్సవాలకు తప్పకుండా వస్తానని సిద్దేశ్వర నంద గిరి మహారాజ్ కు హామీ ఇచ్చారు. ఆయనతోపాటు మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మటన్ బిక్షపతి తదితరులు ఉన్నారు.