09-05-2025 01:13:57 AM
పటాన్ చెరు, మే 8 : అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. సుల్తాన్ పూర్ పరిధిలోని సర్వే నంబర్ 381 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన 12 ఇండ్లు, నాలుగు బేస్మెంట్లను మున్సిపల్, పోలీస్ సిబ్బందితో కలిసి తహసిల్దార్ వెంకటస్వామి కూల్చి వేయించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.