శశిరేఖ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శం కర వర ప్రసాద్ గారు 2026 సంక్రాంతి రిలీ జ్ కి రెడీ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్ బాక్స్ ఎంట ర్టైన్మెంట్స్ బ్యానర్స్‌లో నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చిన సెకండ్ సింగిల్ ప్రోమోతో ఆసక్తిని రేకెత్తించిన తర్వాత నిర్మాతలు శశిరేఖ సాంగ్ ని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలి యో అద్భుతమైన, మెలోడీ ట్రాక్‌ని కంపోజ్ చేశారు.
మెగాస్టార్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులని కట్టిపడేశాయి. అనంత శ్రీరామ్ సాహిత్యం మెగాస్టార్, నయనతార ప్రేమ ప్రయాణం అందంగా ప్రజెంట్ చేసింది. భీమ్స్, మధుప్రియ బ్యూటీఫుల్ వోకల్స్ తో ట్రాక్ నెకస్ట్ లెవల్ కి వెళ్ళింది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ మరో మెయిన్ హైలైట్గా నిలుస్తుంది.
చిరంజీవి, నయనతార జోడి, వారి అందమైన డ్యాన్స్ మూమెంట్స్, ఆకట్టుకునే కెమిస్ట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా చిరంజీవి ట్రెడిషినల్, మోడ్రన్ అవుట్ ఫిట్స్‌లో అద్భుత మైన డ్యాన్స్ మూమెంట్స్ చూడటానికి కన్నుల పండగలా వుంది. ఎగ్జాటిక్ లొకేషన్స్ లో చిత్రీకరించిన విజువల్స్ పాటను మరిం త అందంగా తీర్చిదిద్దాయి.
చిరంజీవి, నయనతార ఇద్దరూ సొగసైన సాంప్రదాయ దుస్తులలో స్క్రీన్ ని మెస్మరైజ్ చేశారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వీటీవీ గణేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్షన్ను పర్యవేక్షిస్తున్నారు.




