calender_icon.png 18 December, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాడు ఆశా వర్కర్.. నేడు సర్పంచ్

18-12-2025 02:15:55 AM

బీఎస్పీ మద్దతుతో విజయం

సిద్దిపేట, డిసెంబర్ 17 (విజయక్రాం తి): ఆశా వర్కర్ అని పిలిచిన వారే సర్పంచమ్మ అంటూ పిల వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామంలో దబ్బెడ రజిత ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేశారు. ప్రత్యర్థిపై 176 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ పదవిని ద క్కించుకుంది. బీఎస్పీ మద్దతుతో పోటీ చేసి న రజిత విజయం సాధించడంతో స్థానిక ఎన్నికలలో ఆ పార్టీ సిద్దిపేట జిల్లాలో బోనీకొట్టింది.

బీఎస్పీ జిల్లా మహిళా విభాగం కన్వీనర్‌గా సేవలందించిన రజిత ఆశా వర్క ర్ ఉద్యోగం లభించడంతో పార్టీ పదవికి రాజీనామా చేసింది. కానీ ఆమె భర్త దబ్బెడ యాదయ్య పార్టీ సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె సర్పంచుగా విజయం సాధించడం గమనార్హం.

టాస్‌తో గెలిచారు

నారాయణఖేడ్/కుబీర్, డిసెంబర్ 17: సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం శాంతి నగర్ తండాలో సువాలిభాయ్ చౌహాన్, రాథోడ్ శ్రీదేవిలకు 194 ఓట్లు చొప్పున వచ్చాయి. ఎన్నికల అధికారులు టాస్ వేయ డంతో సువాలీ భాయ్‌చౌహాన్ గెలిచారు. నారాయణఖేడ్ మండలం బాణాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి  ఒక్క ఓటుతో విజయం సాధించాడు. ఆసిఫాబాద్ జిల్లా కుబీర్ మండలం బెల్గాం తండాలో జాదవ్ గోకు లాస్, జాదవ్ అనిల్‌లకు 192 ఓట్లు సమా నంగా వచ్చాయి. అధికారులు టాస్ వేయగా గోకుల్ దాస్‌కు అదృష్టం వరించింది.