calender_icon.png 18 December, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపాయింటెడ్ డే వాయిదా

18-12-2025 02:18:17 AM

22న కొత్త సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం  

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచు లు, వార్డు మెం బర్లతో ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయడానికి అధికారులు నిర్ణయించారు. కానీ కొత్త సర్పంచుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం వాయిదా పడింది. ప్రమాణ స్వీకార తేదీని ఈ నెల 22వ తేదీకి మా ర్చారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ శ్రీజన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 20న పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. సరైన ము హూర్తాలు లేవని, ఆ రోజు బాధ్యతలు స్వీకరించడం మంచిది కాదని భావించిన పలువురు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో నూ తన సర్పంచుల అ భ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పం చాయతీ రాజ్ శాఖ సానుకూలంగా స్పందించింది. బాధ్యతల స్వీకరణ కా ర్యక్రమాన్ని రెండు రో జులు వెనక్కి జరి పి డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయించింది.

రాష్ర్టవ్యాప్తంగా అన్ని గ్రా మ పంచాయతీల్లో అదే రోజున నూతన సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేర కు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక సమావేశాలుని ర్వహించి, నూతన పాలకవర్గాలతో ప్రమాణస్వీకారం చేయించా లని ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.