calender_icon.png 4 August, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లో నన్ను భయపెట్టే ఆవిడ ప్రేక్షకుల్నీ భయపెట్టనుంది

21-09-2024 12:20:00 AM

హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘ఫియర్’. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డాక్టర్ హరిత గోగినేని ఈ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్లను వివిధ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నటనకు నాకు రోమ్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ దక్కింది’ అన్నారు.

“నేను ఏ సినిమా చేయాలన్నా ముందు టీమ్ నాకు నచ్చాలి. ‘ఫియర్’ టీమ్ నాకు బాగా నచ్చింది. అందుకే రాష్ట్రం దాటి వచ్చా’ అని హీరోయిన్ వేదిక తెలిపింది. “నాకు కమర్షియల్ సినిమాలంటే ఇష్టం. కానీ మా ఆవిడ హరిత చెప్పిన సస్పెన్స్ థ్రిల్లర్ కథ నాకు బాగా నచ్చింది. ఇంట్లో నన్ను భయపెట్టే ఆవిడ ‘ఫియర్’ సినిమాతో ప్రేక్షకుల్ని కూడా భయపెడుతుందని నమ్మాను” అని నిర్మాత ఏఆర్ అభి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.