15 April, 2026 | 12:05 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి

23-11-2025 06:10 PM

గొర్రెల కాపరి గల్లంతు..

కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఘటన..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని సరంపల్లి శివారులో రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 90 గొర్రెలు మృతిచెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి దేవునిపల్లి గ్రామానికి చెందిన సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే ఆయనతో పాటు ఉన్న మరొక దర్శనపు సుధాకర్ ఈత రాకపోవడంతో వాగులో గల్లంతు అయ్యారు. సుధాకర్ అచూకీ ఇంకా లభ్యం కాలేదని రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. పోలీసులు, రిస్క్ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైల్వే ట్రాక్ పైనుంచి గొర్రెల మందను దాటిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.