తలదించుకుని పుస్తకాలు చదివితే.. తలెత్తుకుని జీవిస్తాం
తలదించుకుని పుస్తకాలు చదివితే.. తలెత్తుకుని జీవిస్తాం
09-07-2025 01:09:35 PM
హైదరాబాద్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay ) పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిల్లు పంపిణీ చేశారు. ''మన మోదీ కానుక'' పేరుతో బండి సంజయ్ కుమార్ 20 వేల సైకిళ్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం విద్య కోసం రూ. 1.28 లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలచుకుంటే అద్భుతాలు చేయగలరన్నారు. తలదించుకుని పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకుని జీవిస్తామని సూచించారు. త్వరలో మోదీ కిట్(Modi kit) లు కూడా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని వివరించారు. తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారని చెప్పిన బండి సంజయ్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రుల కష్టానికి సార్థకత చేకూర్చాలని పేర్కొన్నారు.