09-07-2025 01:07:27 PM
పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన గంటల వ్యవధిలోనే చోరీ...
గ్యాస్ కట్టర్ తో ఏటీఎంను లూటీ చేసిన ముష్కరిల ముఠా...
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన గంటల వ్యవధిలోనే ఏటీఎమ్ లో దొంగలు పడ్డారు. బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ బృందం మంగళవారం రాత్రి మార్కండేయ నగర్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అదే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హెచ్ డి ఎఫ్ సి ఏటీఎంను దొంగలు గ్యాస్ కట్టర్ తో కట్ చేసి క్యాష్ బాక్స్ ను ఎత్తుకెళ్ళి పోలీసులకు సవాల్ విసిరారు.సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.