13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

షెఫర్డ్ హ్యాట్రిక్.. విండీస్ విజయం

08-02-2026 01:11 AM

కోల్‌కత్తా, ఫిబ్రవరి 7 : టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్‌పై 35 పరుగుల తేడాతో విజ యం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది.హెట్‌మెయిర్ విధ్వంకర బ్యాటింగ్‌తో విండీస్‌కు భారీస్కోరు అందించాడు. కేవలం 36 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. బ్రాండన్ కింగ్ (35), పావెల్ (24), రూథర్‌ఫర్డ్(26) పరుగులతో రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ క్యూరీ 2, షరీఫ్, డేవిడ్‌సన్, లీస్క్‌తలో వికెట్ తీసారు. ఛేజింగ్‌లో స్కా ట్లాండ్ ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో మూన్సే(10), మెక్‌ముల్లన్(14) నిరా శపరచగా.. మైకేల్ జోన్స్ (1) విఫలమయ్యా డు.

37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బ్రూస్(35), కెప్టెన్ బెర్రింగ్టన్(42) కీలక పార్టనర్‌షిప్ మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత కూడా స్కాట్లాండ్‌కు గెలుపు అవకాశాలు కనిపించాయి. అయితే రొమారియో షెఫర్డ్ ఒకే ఓవర్‌తో మ్యాచ్‌ను పూర్తిగా విం డీస్ వైపు తిప్పేశాడు. 17వ ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసిన షెఫర్డ్ హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. వరుసగా క్రాస్(11), లీస్క్ (0), డేవిడ్‌సన్(0)లను పెవిలియన్‌కు పంపాడు. ఇదే ఓవర్ చివరి బంతికి షరీఫ్(0) ను కూడా ఔట్ చేయడంతో స్కాట్లాండ్ ఓటమి ఖాయమైంది.

తర్వాతి బ్యాటర్లు ఔటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. దీంతో స్కాట్లాండ్ 18.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. అద్భుతంగా బౌలింగ్ చేసిన షెఫర్డ్ 20 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతని కెరీర్‌లో ఇదే బెస్ట్ స్పెల్. అలాగే హ్యాట్రిక్ సాధించిన మూడో విండీస్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో జాసన్ హోల్డర్, స్ప్రింగర్ కూడా టీ ట్వంటీల్లో హ్యాట్రిక్ ఘనతను సాధించగా.. షెఫర్డ్ ఈ ఫీట్ సాధించడం ఇది రెండోసారి.