బీఆర్‌ఎస్‌కు షాక్..
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు సర్పంచులు... వార్డు సభ్యులు....
పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్, జూలై 8 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బుధవారం మండలంలోని ఇద్దరు సర్పంచ్ లతో పాటు పలువురు వార్డు సభ్యులు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కదంబపూర్ సర్పంచ్ కర్రె గట్టయ్య, కనుకుల సర్పంచ్ కర్రే కవిత కుమార్ తో పాటు పలువురు వార్డు సభ్యులు, బిఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, ధనాయక్ దామోదర్ రావు, చిలుక సతీష్, పన్నాల రాములు, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు నామిని రాజిరెడ్డి, అల్లిపూర్ సర్పంచ్ కోదాటి సాయి కిరణ్ పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






