calender_icon.png 12 December, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సొంత మండలంలో షాక్..

12-12-2025 12:16:37 AM

  1. 24 గ్రామపంచాయతీలో 17  బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపు 

ఎమ్మెల్యేపై సొంత కార్యకర్తలే అసహనంట

రాజాపూర్, డిసెంబర్ 11: అసలే ఎమ్మెల్యే సొంత మండలం.. నియోజకవర్గం మాట అటు ఉంచితే సొంత మండలంలో మాత్రం జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డికి షాక్ గురించి చేసిన ఫలితాలు సర్పంచ్ ఎన్నికల్లో వెలువడ్డాయి. ఎమ్మెల్యే సొంత గ్రామంలో  బిజెపి బలపరిచిన అభ్యర్థి గెలవడంతోపాటు మండల పరిధిలోని 24 గ్రామాలలో 17 గ్రామాలలో టిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలవడంతో ఎమ్మెల్యేను ఆశ్చర్యానికి గురిచేసిన సందర్భం నెలకొంది.

గడిచిన రెండేళ్ల కాలంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీరుపై జడ్చర్ల నియోజకవర్గం లో అంతర్యుద్ధం సొంత పార్టీ కార్యకర్తలే ప్రకటిస్తున్నారని ప్రజలు చెబుతున్న మాట. ఇందులో భాగంగానే రాజపూర్ సొంత మండలంలో కూడా ఇలాంటి ఫలితాలు రావడంతో ప్రజలు చెబుతున్న మాటలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

ఇకనైనా ఎమ్మెల్యే తన తీరును మార్చుకొని ప్రజల్లో ఉండాలని ప్రజలకు సమయం కేటాయించాలని ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారంటే అక్కడ ఎంత వ్యత్యాసం చోటుచేసుకుంది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జడ్చర్ల ఎమ్మెల్యే ఈ ఫలితాలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు బిఆర్‌ఎస్ సపోర్ట్ తో గెలవడంతోపాటు అధికార పార్టీ బలపరిచిన వారిలో నాలుగు స్థానాలకు పరిమితమైంది.