12-12-2025 12:16:47 AM
హాజరైన మంత్రి సీతక్క తనయులు
ములకలపల్లి, డిసెంబర్ 11,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మం డలం జగన్నాథపురం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుంజా వినోద్ కు మద్దతుగా గురువారం పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున రోడ్షో నిర్వహించారు.గ్రామ ప్రవేశ ద్వారం నుండి ప్రారంభమైన ఈ రోడ్షో, ప్రధాన రహదారులులో కొనసాగింది.
ఈ రోడ్ షోకు రాష్ట్ర మంత్రి సీతక్క తనయులు సూర్య, సంతోష్ హాజరై అభ్యర్థికి మద్దతుగా ప్రచారం ని ర్వహించి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుంజా వినోద్ ను గెలిపించాల్సిందిగా వారు కో రారు.ఈ బీబీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.