12-12-2025 12:15:07 AM
కల్వకుర్తి డిసెంబర్11: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి . కల్వకుర్తి మండలం లోని 24 గ్రామ పంచాయతీలకు గాను మూడు గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాగా మిగతా 21 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి.
మొత్తం 21 గ్రామపంచాయతీలో 29 ,857 ఓటర్లు ఉండగా 26,280 ఓట్లు పోలయ్యాయి మండలంలో అత్యధికంగా జంగారెడ్డిపల్లిలో 94. 8 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అధికచోట్ల కాంగ్రెస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు,
భారీగా మద్యం నగదు పంపిణీ.
సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు భారీగా మద్యం డబ్బులు పంపిణీ చేసి తమ వైపు మలుపుకునేందుకు ప్రయత్నాలు చేశారు, ఒక ఓటుకు రెండు నుండి మూడు వేల వరకు అందజేసినట్లు తెలుస్తోంది. గెలుపొందిన అభ్యర్థులు ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు.